calender_icon.png 31 July, 2025 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

31న ఇంటర్ గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు

30-07-2025 12:16:30 AM

ఎస్సీ గురుకులాల కార్యదర్శి వర్షిణి

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని భర్తీకాని ఇంటర్ అడ్మిషన్లను ఈ నెల 31న స్పాట్ అ డ్మిషన్ ద్వారా భర్తీ చేస్తామని గురుకులాల కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ అడ్మిషన్లకు వి ద్యార్థులు టెన్త్ మార్కుల మెమో, ఆదాయం, కు లం సర్టిఫికేట్ సిద్ధం చేసి పెట్టుకోవాలని ఆ మె సూచించారు. ఇంటర్‌లో అడ్మిషన్ కొ రకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులు కూ డా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

సాం ఘిక సంక్షేమ గురుకులలో 70 శాతం దళిత వి ద్యార్థులకు, 25 శాతం ఇతర కమ్యూనిటీ వ ర్గాలకు అవకాశం కల్పించనున్నామన్నా రు. వివిధ కళాశాలలో ఉన్న ఖాళీల వివరాలు వె బ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సీట్ల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.