30-07-2025 12:17:01 AM
ఎల్లారెడ్డి జూలై 29 (విజయ క్రాంతి): బీసీ రిజర్వేషన్లకు సహక రించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తెలంగాణలో బీజేపీ నాయకులను తిరగనిచ్చేది లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడుచింతల శంకర్ నేత ఒక ప్రకటనలో పేర్కొన్నారు మంగళవారం ఎల్లారెడ్డిలో మాట్లాడారు.
నాలుగు దశాబ్దాల ఉద్యమ ఫలం సాకారమయ్యే దశలో బీసీల మన మనోస్టెర్యాన్ని దెబ్బతీసేలా రామచందర్ రావు మాట్లాడడం సరికాదన్నారు. రిజర్వేషన్లపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసు కోవాలని డిమాండ్ చేశారు. బీజేపీకి బీసీలు కావాలో, అగ్రవర్గాలు కావాలో తేల్చుకోవాలని తెలిపారు .