నల్లగొండలో కమీషన్ల రాజ్యం నడుస్తోంది
- డబుల్ బెడ్రూంలో రూ.3 లక్షల వసూలు
- మంత్రి పీఏ లెఫ్ట్ రైట్ కలిసి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు
- వాళ్లు చేసే వెంచర్లపైన విచారణ చేస్తాం
- నల్లగొండకు కోమటిరెడ్డి చేసిందేమీ లేదు. దానిపై చర్చకు సిద్ధం
- అక్రమ కేసులు పెడుతున్న డీఎస్పీపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం : మాజీ ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ టౌన్, ఆగస్టు16 : నల్లగొండలో రాక్షస, కమిషన్ల రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండతోనే లెఫ్ట్, రైట్, పి ఏ అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 546 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఒక్కో ఇంటికి 3 లక్షలు వసూలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను ప్రజలు అఖిలపక్ష నాయకుల సమక్షంలో డ్రా తీసి 431 ఇళ్లకు కేటాయించామని, మిగిలిన 130 ఇళ్లు రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయిన వారికి. కేటాయించామన్నారు. ఇప్పుడు ఇచ్చిన కేటాయింపులు డబ్బులు ఇచ్చిన వారికి ఇచ్చారని మళ్లీ డ్రా తీసి అర్హులకు ఇవ్వాలి. లేకుంటే అధికారంలోకి వచ్చాక అన్నీ రద్దు చేసి తిరిగి అసలైన పేదల కు ఇస్తామన్నారు. డబ్బులు ఇచ్చిన వారు తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
15 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సిపిఎం ఆఫీస్ పై పోలీసు దాడిని అమానుషమని ఖండించారు. ఆఫీసులో ఉన్న నాయకులను దారుణంగా అరెస్ట్ చేసి వారి హక్కులకు భంగం కలిగించారని, అరెస్టు కు వెళ్లిన అధికారులను సస్పెండ్ చేయాలని, లేకపోతే ౄGP కి ఫిర్యాదు చేస్తామన్నారు.
వెంచర్ వింటర్ ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని, ప్రభుత్వ నిధులతో ఆ వెంచర్లో రోడ్లు నీళ్ల ట్యాంకులు నిర్మిస్తున్నారని, తమ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై విచారణ చేసి చర్యలు చేపడతామని, వారు చేసే వెంచర్లో ప్లాట్ కొని నష్టపోవద్దని విజ్ఞప్తి చేశారు. 12 ఎకరాల ఓక్కు బోర్డు భూమి ఆక్రమణ చేసిన వెంచర్ను తిరిగి వారికే అప్పగిస్తామన్నారు. 700 కోట్ల ఔటర్ రోడ్డు కమిషన్ల కోసమే వేశారని, 500 మంది నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
IT టవర్, NG కాలేజ్, ఆసుపత్రి, పార్కుల అభివృద్ధి లేదన్నారు. మర్రిగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కమిషన్ల కోసం ఏడాది పూర్తి చేయలేదన్నారు. పానగల్ బైపాస్, మర్రిగూడబై పాస్ కేంద్రాల్లో అనేక మంది ప్రాణాలు పోతుంటే తాను బ్రిడ్జిల నిర్మాణం చేపట్టానన్నారు. మారుతి కార్ల షోరూం కోసం బ్రిడ్జిని చర్ల పళ్లికి మారిస్తే 18 మంది చనిపోయారని, సర్వీస్ రోడ్డు వేయలేదన్నారు.
నేను ప్రజల కేంద్రంగా పట్టణంలో నాలుగు ప్రధాన రహదారులను విస్తరించాలని, ఐటీ అప్ మెడికల్ కాలేజ్, బత్తాయి మార్కెట్, నర్సింగ్ కాలేజ్ ఎన్జీ కాలేజీ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. కోమటిరెడ్డి 27 ఏళ్ల రాజకీయ జీవితంలో మంత్రిగా ఇప్పుడు మూడేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమన్నారు నేను మంజూరు చేయించిన నిధులతోనే జీవోలు మార్చి డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.
మేము ధర్నా చేస్తేనే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించారని, ఆయన ధర్మం గా ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించాడని తెలిపారు. నేను కరోణ సమయం మినహా రెండేళ్ల కాలంలోఆసుపత్రి అభివృద్ధి చేయడంతో నెలకు 1000 డెలివరీ జరిగాయని, పేదలకు 50,వేలు మిగిలాయని, నేడు అస్తవ్యస్తంగా మారిందని పారిశుధ్యం సక్రమంగా లేదని డెలివరీలు 200 జరుగుతున్నాయన్నారు. ఎస్ ల్ బి సి 92 కి మీ లైన్ 3వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చేలా విస్తరించాలని, మెడికల్ కాలేజీకి 200 కోట్లు, కార్పొరేషన్కు 1000 కోట్లు తేవాలని డిమాండ్ చేశారు.
నేను 200జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు భూమి కేటాయించానని, మంత్రి జర్నలిస్టులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. మా నాయకులు కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇక్కడ ఓ డిఎస్పి అతి చేస్తున్నాడని మంత్రిని జోకుతూ అతనిపై డిజిపి కి ఫిర్యాదు చేస్తామన్నారు. తాను క్లాక్ టవర్ సెంటర్లో ఆరు సూట్లతో అతిధులు వచ్చేందుకు భవన నిర్మిస్తే మంత్రి దాంట్లో కులుకుతున్నాడని, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నేను సొంతంగా ఏర్పాటు చేసిన పర్నిచర్ ను ఏసీలను అమ్ముకున్నారని ఆరోపించారు.
ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మంచి పాలన కొనసాగాలని అభివృద్ధి జరగాలన్నారు నాకు ప్రజలు ఒక్కసారి ఇచ్చిన అవకాశం తోనే చరిత్రలో నిలిచిపోయా అభివృద్ధి చేశానన్నారు హ్యామ్ రోడ్ల పేరిట ఎన్జీ కాలేజీలోసీఎం తో మీటింగ్ పెట్టి తన్నుకున్నారని, శిలాఫలకాలు ఎత్తుకెళ్లారని అభివృద్ధికి మాత్రం నిధులు రాలేదన్నారు. బి ఆర్‌ఎస్,బిజెపి కార్పొరేటర్ డివిజన్లో అభివృద్ధి పై వివక్ష చూపుతున్నారని, కాంగ్రెస్లో వారికి నచ్చని వారి డివిజన్లో అభివృద్ధి చేయడం లేదని ఇది సరైన పద్ధతి కాదన్నారు.
మంత్రికి సొంత ఇల్లు లేదంటున్న మంత్రి కి డబుల్ బెడ్ రూమ్ లలో ఒక ఇల్లు కేటాయించండి‘ అంటూ ఎద్దేవా చేశారు. సమావేశంలో కటికం సత్తయ్య గౌడ్, చీరా పంకజ్ యాదవ్, అభిమన్య శ్రీనివాస్, దొడ్డి రమేష్, మారగో ని గణేష్ గౌడ్, పెరిక యాదయ్య, అయితగోని యాదయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, రావుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.






