పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
27-06-2026 02:25 AM
యాదగిరిగుట్ట, జూన్ 26 : యాదగిరిగుట్టలోని సిద్ధార్థ మోడల్ హై స్కూల్ 199899 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు 28 సంవత్సరాల తర్వాత శుక్రవారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలనాటి గురువులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కే. కృష్ణమాచార్యులు, గడ్డమీది రాజు, బి. మురళీధర్ శర్మ, ఎం. రామాచా ర్యులు, కే.ఉపేందర్ పాల్గొన్నారు.






