9 July, 2026 | 1:22 AM

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

11-06-2024 12:13 AM

మెట్రో వాటర్ వర్క్స్ ఎండీకి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వినతి

ఎల్బీనగర్, జూన్ 10: ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేపట్టిన, చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ. 40 కోట్ల నిధులు మంజూరు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోరారు. మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డిని సోమవారం కలిసిన ఎమ్మెల్యే.. నియోజకవర్గ సమస్యలపై వివరించారు. శివారు ప్రాం తాల్లో తాగునీరు, మురుగు నీటి సమస్యల పరిష్కారానికి రూ. 20 కోట్లు అవసరమని వివరించారు. తాగునీటి సమస్య తీర్చడానికి సుమారు 80 కిలోమీటర్ల వరకు పైపులైన్ పనులు చేపట్టినట్లు వివరించారు. 18 కిలోమీటర్ల అదనపు వాటర్ పైపులైన్ మంజూ రు చేయాలని గతంలోనే కోరినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, అరవింద్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, సుజిత్ ఉన్నారు.