28 August, 2026 | 2:41 AM

నేరాలు, ప్రమాదాల అదుపునకు పకడ్బందీ ప్రణాళిక

28-08-2026 01:24 AM

డి.ఎస్.పి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో తనిఖీ నిర్వహించిన ఎస్పీ నర్సింహ

కోదాడ, ఆగస్టు 27: పలు రకాల నేరాలు, రహదారులపై ప్రమాదాల అదుపుకు ప కడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎస్పీ నర్సింహ స్పష్టం చేశారు. గురువారం కోదాడ డి.ఎస్.పి కార్యాలయం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో తనిఖీ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పెరుగుతున్న జన సమర్థంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందువల్ల ట్రాఫిక్ ని యంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల భద్ర తకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నామని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు, సామాజిక అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించి చైతన్యంతెచ్చేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్త మవుతుందన్నారు.

రహదారులపై వాహనాలు బ్రేక్ డౌన్ అయినట్లయితే వెంటనే 112కు డయల్ చేయాలని ఆయన వాహనదారులకు ప్రయాణికులకు సూచించారు. ప్ర జల భద్రతలో అనుక్షణం అప్రమత్తతతో ఉండాలని పోలీసులకు సూచించారు. సాంకేతికతను అవగతం చేసుకొని స్మార్ట్ పోలీసిం గ్ నిర్వహించాలన్నారు. డివిజన్ పరిధిలో ఉ న్న పోలీస్ స్టేషన్లో పనితీరుపై ఎప్పటికప్పు డు పర్యవేక్షణ చేయాలని డి.ఎస్.పి కి సూ చించారు.ఈ తనిఖీ నిర్వహణలో డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డి, సిఐలు శివశంకర్ నాయక్ చరమందరాజు రామకృష్ణారెడ్డి ట్రాఫిక్ ఎస్‌ఐ అంజిరెడ్డి ఎస్త్స్రలు నవీన్ మోహన్ ఆర్‌ఎస్‌ఐ అఖిల్ పాల్గొన్నారు.