రొమాంటిక్ పాత్ర చేయాలని ఉంది
‘లైగర్’ ముద్దుగుమ్మ అనన్య పాండే తాజాగా ‘కంట్రోల్’తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అమ్మడి కోరిక స్త్రంటో కూడా చెప్పింది. గతంలో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ‘ చిత్రంలో చిన్న పాత్ర పోషించానని.. ఇప్పుడు హీరోయిన్‌గా నటించాలని ఉందని తెలిపింది.
తనకు చాలా ఇష్టమైన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అని, ఆయన సినిమాలోనూ నటించాలని ఉందని తెలిపింది. జానర్ విషయంలోనూ తన కోరికను అనన్యా పాండే వెలిబుచ్చింది. రొమాంటిక్, హారర్ జానర్‌తో పాటు వెబ్ సిరీస్‌లలో సైతం నటించాలని ఉందని తెలిపింది.
తన తొలి సినిమా మొదలు ఇప్పటి వరకూ కెరీర్‌లో ఎంతో పరిణతి చెందానని.. ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అనన్యాపాండే తెలిపింది. తనకు కాస్త విరామ సమయంలో లభిస్తే సామాజిక మాధ్యమాల్లో ఉండిపోతానని తెలిపింది. అభిమానులకు తన నచ్చిన సినిమాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ ఉంటానని అనన్య చెప్పుకొచ్చింది.






