సర్కారు బడుల్లో ‘గుణాత్మక’ విప్లవం
- ప్రైవేట్‌కు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు
- నమోదు పెంపే లక్ష్యంగా అడుగులు
- విద్యాశాఖ యాక్షన్ ప్లాన్
- జిల్లా వ్యాప్తంగా 1244 పాఠశాలలు
- 1.42 లక్షల మంది విద్యార్థుల విద్యాభ్యాసం
రంగారెడ్డి, ఆగస్టు 13(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా, విద్యార్థుల్లో గుణాత్మక మార్పు తీ సుకురావడమే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ప్రక్షాళన చర్యలకు శ్రీకారం చుట్టిం ది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉచిత విద్య, డిజిటల్ మౌలిక వసతులు అందిస్తున్న సర్కారు బడుల వైపు తల్లిదండ్రులను ఆకర్షించేందు కు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది.
రెండు రోజుల క్రితం జరిగిన జిల్లా ఐడిఓసీ కా న్ఫరెన్స్ హాల్లో జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి, స్టేట్ టాస్ డైరెక్టర్ లింగయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంఈఓ లు లు, జిహెచ్‌ఎంలు సీఆర్పీలు , కోఆర్డినేటర్లు హాజరయ్యారు.
అడ్మీషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి..
ప్రభుత్వ బడుల్లో ఉన్న ఉచిత విద్యా వి ధానం, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకా లు, యూనిఫాంలు వంటి సంక్షేమ పథకాల పై గ్రామగ్రామాన విస్తృత అవగాహన క ల్పించాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల బాధ్యత కేవలం పుస్తకాల్లోని పాఠాలు బో ధించడమే కాదు.. విద్యార్థులలో నైతిక విలువలు, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ నూరి పోయాలి అని అదనపు కిరణ్మయి కలెక్టర్ సూచించారు. అధికారులు, సీ అర్ పీ లు గ దులకే పరిమితం కాకుండా పాఠశాలలను సందర్శించి ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని టాస్ డైరెక్టర్ లింగయ్య స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయి విశ్లేషణ..
గత పదవ తరగతి ఫలితాలను విశ్లేషించగా జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ విద్యాసంస్థ లు సత్తా చాటినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ని కొన్ని జెడ్పీ హూస్కూల్స్‌లలో ఉత్తీర్ణత తగ్గిపోవడం విద్యాశాఖకు సవాలుగా మారింది.
ప్రాథమిక నైపుణ్యాల లోపం...
ఉన్నత తరగతులకు వచ్చినా చాలామంది విద్యార్థులకు కనీస చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు బలహీనంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వెనుకబడిన పాఠశాలలను ప్రత్యేకంగా గుర్తించి, ఆయా పాఠశాలల్లో మందకొడిగా ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక బోధన అందించాలని నిర్ణయించారు.
సమీక్షలతో మార్పు సాధ్యమేనా?
రాష్ట్ర ప్రభుత్వం బడుల బలోపేతానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. నిరంతరం సమీక్షలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో మార్పు వస్తుందా? అనేది ఇప్పుడు మిగిలిన ప్రధాన ప్రశ్న.అధికారుల ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు జరిగినప్పుడే ’సర్కారు విద్య’ సాధారణ ప్రజలకు మరింత చేరువవుతుంది.






