12 July, 2026 | 1:51 AM

కేవీకే ఫార్మసీ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

12-07-2026 12:49 AM
  1. బీ ఫార్మసీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ప్రముఖుల ప్రశంస 
  2. ముఖ్య అతిథిగా కేఈఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి హాజరు

హైదరాబాద్, జూలై 11(విజయక్రాంతి): విద్యా ప్రమాణాలలో ఉత్తమ నాణ్యతను కనబర్చినందుకు కేవీకే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్ర తిష్ఠాత్మక ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ సందర్భంగా శనివారం కళాశాల లో బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థుల వీడ్కో లు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేఈఎస్ ఈఎస్ కార్యదర్శి సతీష్ వి.కడియాల ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన ఫార్మసీ విద్య, పారదర్శక పరిపాలనకు ఈ ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఓ గుర్తిం పు నిదర్శనమన్నారు. బీ ఫార్మసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముం దుకు సాగుతూ తమలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి సమాజ సేవకు ఉపయోగించాలని.. అభ్యసించిన కళాశాల పేరును మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. కళాశాల ఆడిటర్ హర గోపాల్ మా ట్లాడుతూ కేవీకే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఐఎస్‌ఓ గుర్తింపు పొందినందుకు అభినందనలు తెలియజేశారు.

భవి ష్యత్తులోనూ ఇదే విధమైన నాణ్యమైన అం తర్జాతీయ ప్రమాణాలను కొ నసాగించాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. అధ్యాపకులు అలాగే కళాశాల సిబ్బంది సమిష్టి కృషి వల్లే కేవీకే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కి ఈ ఘనత సాధ్యమైందని ఎ సతీష్ చంద్ర అన్నారు. భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యా, పరిశోధనా రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తా మని తెలియజేశారు. నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడంలో అధ్యాపకుల పాత్ర కీలకమని ఐక్యూఏసీ,ఎన్బీఏ కోఆర్డినేటర్ డాక్టర్ వైఎన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతు లు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.