అల్లుడిని కొట్టి చంపిన మామ
కేసముద్రం, జూన్ 16 (విజయక్రాంతి): కేసముద్రం మండ లం ఉప్పరపల్లి గ్రా మంలో మామ ఇనుపరాడుతో అల్లుడి త లపై కొట్టి చంపినట్లు కేసముద్రం సీఐ సత్యనారాయణ తెలిపారు. కుండె నరేష్ తన భార్య అనుషతో గత కొంతకాలంగా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అనూష పిల్లల్ని తీసుకొని అదే గ్రామంలోని తన తల్లి గారి ఇంటికి వెళ్లింది. సోమవారం రాత్రి నరేష్ అత్తగారింటికి చేరుకొని భార్య అనూషను కొట్టుకుంటూ బయటకు తీసుకురాగా, అత్త అడ్డుపడింది.
ఈ క్రమంలో మామ కంకల కుమారస్వామి ఇనుప రాజు తీసుకువచ్చి అల్లుడ్ని తలపై గట్టిగా కొట్టాడు. దీనితో నరేష్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘట న తర్వాత నరేష్ మామ, అత్త, భార్య పారిపోయారు. సంఘటనపై కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద అత్త కళమ్మ, భార్య అనూష, మామ కుమారస్వామి లను అరెస్ట్ చేసినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడు స్వాధీ నం తీసుకొని, నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు.






