ఘనంగా బీకాం బధిర విద్యార్థుల వీడ్కో లు
హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ
హైదరాబాద్, మార్చి 28(విజయక్రాంతి) : హెలెన్ కెల్లర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం బీకాం మూడో సంవత్సరం విద్యార్థినీ విద్యార్థుల వీడ్కోలు పార్టీ ఘనంగా నిర్వ హించారు. ఈ వేడుకలను ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థుల సమక్షంలో కటికనేని సరస్వతి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల చేత ఆటపాటలు అదే విధంగా ర్యాం ప్ వాక్ చేయించారు.
ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, గౌరవ అతిథిగా కొల్లి నాగేశ్వరరావు, విశిష్ట అతిథిగా గోపు రమణారెడ్డి, కే మీనా ఉపేందర్ రెడ్డి, సంస్థ చైర్మన్ లయన్ పటాన్ ఉమర్ఖాన్, ప్రిన్సిపాల్ లయ న్ జాజుల అంజయ్య పాల్గొన్నారు. ముఖ్యఅతిథి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హె లెన్ కెల్లర్స్ విద్యాసంస్థ 40 సంవత్సరాల నుంచి బధిర విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు విద్యను అందిస్తున్నందు కు సంస్థ చైర్మన్ పటాన్ ఉమర్ఖాన్‌ని అభినందించారు. సమాజంలో దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనపరుస్తున్నారన్నారు.
చదువులోనూ ఆటపాటలలోనూ పేరా ఒలింపిక్స్ లోను ఎన్నో పథకాలను తీసుకొస్తున్నారన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో 75 వేల మంది వివిధ రకాలైన దివ్యాంగులకు పెన్షన్ అందిస్తున్నామని ఈ టల తెలిపారు. ఇంతమంది తల్లిదండ్రులను తమ పిల్లల వైకల్యంతో ఉన్నారా అనే బాధ లేకుండా వారికి కేంద్ర ప్రభుత్వం తగిన గు ర్తింపును అందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారన్నారు.
కాగా నృత్య ప్రదర్శనలో ప్రతిభను కనబర్చిన విజేతలకి నగదు బహుమతిని ఈటల రా జేందర్ చేతులమీదుగా అందజేశారు. హెలె న్ కెల్లర్స్ అధినేత లయన్ పఠాన్ ఉమ్మర్ ఖాన్ మాట్లాడుతూ వీడ్కోలు పార్టీతో పాటు చదువులో కూడా ముందుండాలని, విద్య లో అందరు కష్టపడి చదివి జీవితంలో ఉన్న త స్థాయిలో స్థిరపడి వారి వారి కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలన్నారు.
5000 మంది బీకాం గ్రాడ్యుయేట్స్ లను ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది వివిధ రంగాలలో స్థిరపడే విధంగా ప్రభుత్వ రంగాల్లో కూడా చా లా మంది గెజిటెడ్ ఆఫీసర్లను తయారు చేశామన్నారు. డాక్టర్ ఆర్ము గం, డాక్టర్ శశిధర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.




