calender_icon.png 5 October, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజా యుద్ధం ముగింపునకు ముందడుగు

05-10-2025 12:49:46 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై భారత ప్రధాని మోదీ ప్రశంసలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఇజ్రాయెల్ హమాస్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం ముగింపునకు కీలక ముందడుగు పడింది. గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాను హమాస్ అంగీకరించింది. ఈ తాజా పరిణామాలను భారత్ స్వాగతించింది. గాజాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ నాయకత్వాన్ని ప్రధాని మోదీ అభినందించారు.

గాజాలో శాంతి ప్రయత్నాల్లో నిర్ణయాత్మక పురోగతి సాధించిన ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నట్లు మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. హమాస్ నుంచి బందీల విడుదలకు అంగీకారం కుదరడం శాంతిస్థాపనకు కీలక ముందడుగని అభిప్రాయ పడ్డారు. శాశ్వత, న్యాయమైన శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తుందన్నారు. గాజా యుద్ధం ఆపేందుకు ట్రంప్ చేసి ప్రతిపాదనలు తొలుత ఇజ్రాయెల్ అంగీకరించింది.

ఈ క్రమంలోనే హమాస్ తన అంగీకారం తెలపకపోవడంపై ట్రంప్ కోపోద్రిక్తుడయ్యారు. అదివారం సాయం త్రం ఆరు గంటల్లోపు (అమెరికా కాలమానం ప్రకారం) ఒప్పందం కుదుర్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హమాస్‌ను హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన హమాస్.. బందీల విడుదలకు అంగీకరించింది. అయితే, ప్ర తిపాదనలోని కొన్న విషయాలపై ఇంకా చర్చలు జరపాల్సి ఉందని పేర్కొంది. హమాస్ ప్రకటన నేపథ్యంలో గాజాపై దాడులు చేయొద్దంటూ ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు.