05-10-2025 01:03:42 AM
బీహార్ ఎన్నికల ప్రచారంలో మోదీ
పాట్నా: బీహార్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది పట్టభద్రులకు నెలకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రెండేళ్ల పాటు యువతకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. శనివారం ఆయన బీహార్‌లో పర్యటించి జన్‌నాయక కర్పూరీ ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించారు.
మొత్తం రూ.62 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. నిశ్చయ్ స్వయం సహాయక భత్యం పథకాన్ని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒకేష నల్ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్డీఏ పాలనలో మరో 5 వేలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.