అమృతం సీరియల్‌లాంటి సినిమా
అంకిత్ కొయ్య హీరోగా, శ్రియా కొంతం హీరోయిన్‌గా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్స్ ఇంట్లో’. శ్రీ హర్ష దర్శకత్వంలో సత్య నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమాకు సంబంధించి స్నీక్ పీక్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘అమృతం సీరియల్‌లా మా సినిమాను ఎంజాయ్ చేస్తారు. హర్ష అనే కారెక్టర్ గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లగానే డోర్ లాక్ అవ్వడం, పద్నాలుగు రోజులు ఇంట్లోనే ఉండటంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది సినిమా కథ. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుంది’ అని అన్నారు. ‘కొత్త వాళ్లం ఈ చిత్రాన్ని తీశాం. ఎంకరేజ్ చేయండి’ అని డైరెక్టర్ శ్రీహర్ష కోరారు. నిర్మాత సత్య మాట్లాడుతూ.. ‘సెన్సిబుల్ మెసెజ్ ఇస్తూనే ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది’ అని చెప్పారు. సహ నిర్మాత నాగు, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.






