ధర్మబిక్షం ఆశయసాధన కోసం పోరాటం
యాదగిరిగుట్ట, మార్చి 26 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ పార్లమెంట్ సభ్యులు గీతా పని వారిలా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మగాని ధర్మబిక్షం 15వ వర్ధంతి పట్టణంలోని గుండ్లపల్లి గౌడ సొసైటీలో నిర్వహించడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ధర్మ బిక్షం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్మ బిక్షం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.నిత్యం పేద ప్రజల హక్కుల కోసం కృషి చేశారని మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా పనిచేశారని అన్నారు.గీత వృత్తి లో ఉన్న కష్టాలను చూసి గీతా పనివాళుల సంఘం ఏర్పాటు చేసి అనేక పోరాటాలు చేసి గీతా కార్మికులకు పెన్షన్, తాడిచెట్టు పై నుండి కింద పడిన వారికి ప్రభుత్వం ఎక్సిగ్గేషియా చెల్లించడం, తాడిచెట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం భూమిని ఇప్పించే విధంగా హక్కులను కల్పించిన గొప్ప నాయకుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు కళ్ళెం కృష్ణ, యువజన సమైక్య జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, కో ఆప్షన్ సభ్యులు మాజీ పేరబోయిన పెంటయ్య, సిపిఐ మండల కార్యదర్శి కల్లపేల్లి మహేందర్, గీతా పనివర్ల సంఘం నాయకులు గుండు వెంకటేష్, మాటూరు మల్లయ్య, గుండ్లపల్లి గౌడ సంఘం సభ్యులు ఎరుకల హేమేంధర్, దుశెట్టి చంద్రయ్య, కీసర బాలరాజు, సిపిఐ నాయకులు పేరబోయిన బంగారి, గోపగాని రాజు, గౌడ సంఘం నాయకులు గుండ్లపల్లి లింగం, అరె శ్రీధర్, పచ్చిమట్ల నరేష్, ఆరె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




