04-12-2025 12:23:54 PM
గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది
మంచి భవిష్యత్తు పొందాలంటే మంచి చదువు తప్పనిసరి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగం అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తమ స్వంత నిధులతో ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ మహబూబ్ నగర్ నగరంలోని ప్రభుత్వ కొన పాలమూరు, ప్రభుత్వ గాంధీ రోడ్ మరియు ప్రభుత్వ మాడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐఐటి కళాశాలల్లో ప్రవేశం పొందడానికి ఇది ఒక విలువైన అవకాశమని పేర్కొన్నారు. మంచి భవిష్యత్తు ఉండాలంటే మంచి చదువు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి అందాలని సూచించారు. పాఠశాల మౌలిక వసతుల నుంచి విద్యార్థుల భవిష్యత్తు సన్నాహకానికి వరకూ సమగ్ర సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమానికి ఎఎంఓ దుంకుడు శ్రీనివాస్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వివిధ పాఠశాల, ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.