04-12-2025 12:22:14 PM
లక్షెట్టిపేట టౌన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలను(Datta Jayanti celebrations) భక్తులు ఘనంగా జరుపుకున్నారు. భక్తులు గురువారం ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మహాభిషేకం, 10 గంటలకు చాలీసా పారాయణం, 12 గంటలకు మంగళహారతి, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదానం జరిపారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం 6 గంటలకు దీపాలంకరణ, సంధ్య హారతి, పల్లకి సేవ, రాత్రి మండల పూజ, ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.