1 April, 2026 | 3:34 AM

పంత్ కెప్టెన్సీకి పరీక్ష

01-04-2026 01:13 AM
  1. ఢిల్లీతో తలపడనున్న లక్నో

మార్ష్, పూరన్‌లపై అంచనాలు

కేఎల్ రాహుల్‌పైనే ఢిల్లీ ఆశలు

లక్నో, మార్చి 31 : ఐపీఎల్ 19వ సీజన్‌లో ఇంకా అసలైన జోష్ కనిపించడం లేదు. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌లలో ఉత్కంఠగా సాగిన మజా అయితే లేదు. 8 జట్లు తలపడగా.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌తో అన్ని జట్లు తమ తొలి మ్యాచ్‌ను ఆడినట్టవుతుం ది. ఏక్నా స్టేడియం వేదికగా బుధవారం ఢిల్లీ, లక్నో తలపడబోతున్నాయి. ఈ సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్ కెప్టెన్సీకి పరీక్షగా చెప్పొచ్చు.

పంత్ కూడా ఈ ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తే తప్ప భారత జట్టులో ప్లేస్ సుస్థిరం కాదు. 2025 సీజన్‌లో పంత్ 269 పరుగులు చేయగా.. దీనిలో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ సారి దానికి మించిన ప్రదర్శన చేయడం తో పాటు జట్టును సమర్థవంతంగా నడిపించాల్సి ఉంటుంది. గత సీజన్ లో లక్నో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉం టే ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది.

మిఛెల్ మార్ష్, మార్క్ రమ్  టాపార్డర్‌లో కీలక ఆటగాళ్లుగా చెప్పొచ్చు. అలాగే ఒంటిచేత్తో మ్యా చ్‌ను మలుపుతిప్పే నికోలస్ పూరన్ లాంటి ప్లేయర్ ఉండడం అడ్వాంటేజ్. అయితే లక్నో మిడిలార్డర్ మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. ఆయుశ్ బదోనీ, రఘువంశీ, అబ్దు ల్ సమద్ ఎంతవరకూ రాణిస్తారో చూడాలి. అటు బౌలింగ్‌లో మాత్రం లక్నో పేస్ ఎటాక్ స్ట్రాంగ్‌గా ఉంది. మహ్మద్ షమీ, అవేష్ ఖా న్, మయాంక్ యాదవ్  లాంటి స్వదేశీ పేసర్లతో పాటు అన్రిచ్ నోర్జే లాంటి విదేశీ పేసర్ కూడా జట్టులో ఉన్నాడు. ఇక స్పిన్ విభాగంలో నోట్ బుక్ సెలబ్రేషన్స్‌తో వైరల్ గా మారిన దిగ్వేష్ రాఠీపైనే లక్నో ఆశలు పెట్టుకుంది.

మరోవైపు ఢిల్లీ క్యా పిటల్స్ గత సీజన్‌లో లీగ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఇప్పటి వరకూ టైటిల్ గెలవని ఆ జట్టు కొత్త సీజన్‌ను ఘనవిజయంతో ఆరంభించాలని ఎదురుచూస్తోంది. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి సమతూ కంగా కనిపిస్తోంది. టాపార్డర్‌లో కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ప్లే యర్ ఉండ డం అతిపెద్ద బలం. గత సీజన్ లో రాహుల్ సూపర్ ఫామ్ తో చెలరేగిపోయాడు.

13 మ్యాచ్ లలో 149కు పైగా స్ట్రైక్ రేట్ తో 539 పరుగులు చేశాడు. రాహుల్ కు జోడీగా పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. అలాగే కరణ్ నాయర్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్ లాంటి హిట్టర్ల నుంచి ఢిల్లీ భారీ ఇన్నింగ్స్ లు ఆశిస్తోంది. వీరితో పాటు అభిషేక్ పోరెల్‌పైనా అంచనాలున్నాయి. ఫినిషర్ రోల్‌లో రిజ్వీ, అశుతోష్ శర్మలలో ఒకరికి చోటు దక్కొచ్చు. బౌలింగ్‌లో నటరాజన్, అకిబ్ నబీతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై ఢిల్లీ ఆశలు పెట్టుకుంది. 

గత రికార్డులు

ఇరు జట్లు 7 మ్యాచ్‌లలో తలపడగా ఢిల్లీ క్యాపిటల్స్ 4 సార్లు, లక్నో సూపర్ జెయిం ట్స్ 3 సార్లు విజయం సాధించాయి. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయిగా నిలిచింది.

పిచ్ రిపోర్ట్ 

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఏక్నా స్టేడియం పిచ్ బాలెన్సింగ్ ఉంటుందని అంచనా. బ్యా టర్ల కంటే బౌలర్లకే అనుకూలిస్తుందని చెబుతున్నారు. 

తుది జట్లు అంచనా

లక్నో సూపర్‌జెయింట్స్ : మిఛెల్ మార్ష్, మార్క్మ్,్ర పంత్ (కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుశ్ బదౌనీ, అబ్దుల్ సమద్, అన్రిచ్ నోర్జే, మహ్మద్ షమీ, అవేశ్ ఖాన్, మయాం క్ యాదవ్, దిగ్వేష్ 

ఇంపాక్ట్ ప్లేయర్ : షాబాజ్ అహ్మద్

ఢిల్లీ క్యాపిటల్స్ : పతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ (కీపర్), నితీష్ రాణా, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, ఆకిబ్ నబీ, కుల్దీప్ యాదవ్, ఎంగిడి

ఇంపాక్ట్ ప్లేయర్ : నటరాజన్