1 April, 2026 | 2:45 AM

అవినీతిమయమైన హెచ్‌సీఏను రద్దుచేయాలి

01-04-2026 01:10 AM
  1. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్
  2. వరంగల్‌ను క్రికెట్ హబ్‌గా మార్చేందుకు కృషి
  3. గ్రామీణ ప్రతిభకు వేదికగా టీసీఏ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్
  4. టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి

వరంగల్, మార్చి 31 : అవినీతికి చిరునామాగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసి యేషన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసిం ది. హెచ్‌సీఏలో జరిగిన అవినీతిపై ప్రస్తుతం సీఐడీ దర్యాప్తు చేస్తోందని టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి చెప్పారు. గతంలో టీసీఏ ఇచ్చి న ఫిర్యాదుల ఆధారంగానే అరెస్టులు జరిగాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వరంగ ల్ జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించా రు. జిల్లాలో ఆధునిక సౌకర్యాలతో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామన్నారు.

యువ క్రికెటర్ల కోసం అకాడమీ కూడా ప్రారంభించాలని టీసీఏ నిర్ణయించినట్టు తెలిపారు. క్రికెట్‌ను వినోదంగా కాకుండా లక్ష్యసాధన తీసుకోవాలని గురువారెడ్డి సూచించారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు మరింత ప్రోత్సా హం అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించి భవిష్యత్తు లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా టీసీఏ తరపున 10 అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించనున్నట్టు వెల్లడించారు. దీని ద్వారా ఏడాదికి 150 మంది యువ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ క్రికెటర్ల ఆధ్వర్యంలో బీసీసీఐ సర్టిఫైడ్ లెవె కోచింగ్ అందించనున్నట్టు వివరించారు.

దీనిలో భాగంగా మొదటి అకాడమీ వరంగల్‌లోనే మల్టీనేషనల్ కంపెనీ సహకారంతో ప్రారంభించనున్నట్టు గురువారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. పెసరు విజయచందర్‌రెడ్డి, మాజీ రంజీ ప్లేయర్ జయచందర్, వరంగల్ జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి జైపాల్, జాయింట్ సెక్రటరీ అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.