కవయిత్రి మొల్లకు ఘన నివాళి
నల్లగొండ, మార్చి 13 (విజయక్రాంతి) : తొలి కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా నల్లగొండలో శాలివాహన ఉద్యోగులు ఆ సంఘం కార్యాలయంలో మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి అంజయ్య మాట్లాడుతూ.. కవయిత్రి మొల్లమాంబ నాటి కట్టుబాట్లను ఛేదిస్తూ సమాజాన్ని ఎదుర్కొని నిలిచిందని, ఆమె రచనలు వాడుకభాషకు దగ్గరగా ఉండేదని అన్నారు.
మొల్ల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో శాలివాహన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శిరసవాడ చంద్రం, నాయకులు నిమ్మనగోటి వెంకటరమణ, నిమ్మనగోటి జనార్ధన్, గంగాధర నర్సింహ, బత్తుల శ్రీనివాస్, పాలబిందెల శ్రీను, సలిగంటి సైదులు, సిలివేరు లింగమూర్తి, తరాల పరమేశ్ యాదవ్, ముప్పిడి మల్లయ్య, శేషరాజులపల్లి వెంకన్న, నిమ్మనగోటి శ్రీను పాల్గొన్నారు.






