బిఆర్‌ఎస్ రాస్తారోకో
02-09-2025 10:53 PM
కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణం తల్లి చౌరస్తా వద్ద మంగళవారం భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. "పిసి ఘోష్ కమిషన్ నివేదిక అంటే కాంగ్రెస్ స్క్రిప్ట్. కాంగ్రెస్ పాలన అంటే తెలంగాణ అభివృద్ధికి బ్రేక్," అని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఈ కుట్రలను అర్థం చేసుకున్నారని, రైతుల పొలాలు ఎండిపోకుండా, తెలంగాణ కలలు చెదరకుండా, కేసీఆర్, హరీష్ రావు లపై జరుగుతున్న ప్రతి కుట్రను బిఆర్‌ఎస్ మట్టికరిపిస్తుందని నాయకులు అరోపించారు.






