27-10-2025 04:47:09 PM
విద్యార్థి సంఘాల డిమాండ్..
నిర్మల్ (విజయక్రాంతి): పీజీ కాలేజ్ ని బేస్ చేసుకుని యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం భగత్ సింగ్ భవనంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో ఉన్న పీజీ కాలేజ్ ని బేస్ చేసుకుని నూతన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దిగవత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేస్తానన్న యూనివర్సిటీని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మల్ జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లాలో ఉన్నంత విద్య లేక దూర ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే విద్యను ఆపేసే పరిస్థితి ఏర్పడుతుంది కావున జ్ఞాన సరస్వతి పేరిట నిర్మల్ జిల్లా కేంద్రంగా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ ఏర్పాటయితే యువతకు ఉన్నంత విద్య అందుబాటులో ఉంటుందని స్థానికంగానే ఉన్నంత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది.
కావున యూనివర్సిటీ ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం లేనియెడల దశలవారీగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగాంబర్ సింగారి వెంకటేష్, PDSU జిల్లా అధ్యక్షులు AISF జిల్లా ప్రధాన కార్యదర్శి కైలాస్, BC విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం శివాజీ గౌడ్ జస్వంత్, రాకేష్, కార్తీక్, రాజు, రంజిత్ కుమార్, రవి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.