calender_icon.png 27 October, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాత్ర ఆనందం సర్వీసులను సద్వినియోగం చేసుకోండి

27-10-2025 04:49:20 PM

నిర్మల్ రూరల్: టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం యాత్ర ఆనందం సర్వీసులను నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. సోమవారం నిర్మల్ డిపోకు చెందిన లగ్జరీ సర్వీసును యాత్ర ఆనందంలో భాగంగా అయోధ్య వెళ్లే భక్తులకు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ సర్వీస్ సేవలు ఉంటాయని వచ్చేనెల 6, 7 తేదీల్లో అయోధ్య అరుణాచలం రామేశ్వరం తిరుపతికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రచార అధికారి రమణ అధికారులు పాల్గొన్నారు.