ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం
17-08-2024 01:11 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి)/ రాజేంద్రనగర్: స్వల్పకాలిక పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం తెలంగాణకు విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి గవర్న ర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహదారు హర్కార వేణుగోపాల్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి దంపతులు నగరంలోని కన్హాశాంతి వనంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి తరలివెళ్లారు.






