ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి
* విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు
* ఎంపీ రఘునందన్‌రావు
గజ్వేల్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు సంతకాల సేకరణ చేపట్టి రోడ్డెక్కుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫీజు రీయింబర్స్మె్ంప వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గజ్వేల్ పట్టణంలో ఆదివారం పద్మశాలి సంఘం కిచెన్షెడ్, టూ వీలర్స్ అసోసియేషన్ భవన నిర్మాణాలకు ఎంపీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్లు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
ఒకరు క్షుద్ర పూజలంటూ, మరొకరు చర్చలకు రావాలని అంటూ ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్కు విద్యార్థుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫీజు రీయింబర్స్మె్ంప ప్రభుత్వం ఎంత బకాయి ఉంది, ఎప్పటిలోగా చెల్లిస్తారనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించకుండా రాజకీయ విమర్శలతో కాలయాపన చేయడం సరికాదన్నారు.






