వడ్డెర కాలనీలో చేతిపంపు మరమ్మతులు
10-08-2026 02:04 AM
వెంకటాపూర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని 13వ వార్డులో గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ సూచన మేరకు వడ్డెర కాలనీలో పనిచేయకుండా ఉన్న చేతిపంపును ఉపసర్పంచ్ అన్నబోయిన రాజు ఆధ్వర్యంలో ఆదివారం మరమ్మతు చేయించారు. దింతో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన నాయకులు స్థానికులను కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఈ జిల్లా అధ్యక్షులు మామిడిశెట్టి కోటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లెన వెంకటేష్, రెడ్డి శ్రీధర్, సూర రమేష్, అల్లేపు సందీప్, మంద సురేష్ తదితరులు పాల్గొన్నారు.






