23 June, 2026 | 10:27 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

భార్య ఇంటికి ఆభరణం!

09-02-2025 12:00 AM

నేడు ప్రపంచ వివాహ దినోత్సవం

భరించేది భార్య

బతుకు నిచ్చేది భార్య

చెలిమి నిచ్చేది భార్య

చేరదీసేది భార్య

ఆకాశాన సూర్యుడు లేకపోయినా...

ఇంట్లో భార్య లేకపోయినా...

అక్కడ జగతికి వెలుగుండదు,

ఇక్కడ ఇంటికి వెలుగుండదు. 

భర్త వంశానికి సృష్టికర్త

మొగుడి అంశానికి మూలకర్త

కొంగు తీసి ముందుకేగినా...

చెంగు తీసి మూతి తుడిచినా.. ముడిచినా..

తనకు లేరు ఎవరూ సాటి 

ఇలలో తను లేని ఇల్లు.. కలలో....

ఊహకందని భావన.

బిడ్డల నాదరించి, పెద్దల సేవలో తరించి

భర్తని మురిపించి.. మైమరపించి...

బతుకుమీద ఆశలు పెంచి

చెడు ఆలోచనలు త్రుంచి

భ్రమరంలా ఎగురుతూ

భర్తను భ్రమల నుండి కిందకు దించుతూ

కళ్ళు కాయలు కాచేలా

భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన

జీతం లేని పని మనిషి.

జీవితాన్ని అందించే మన మనిషి.

 ... 

ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం 

ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప.. 

ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం. 

బిడ్డల బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో 

నూతన వసంతం తోడు నీడ బంధం. 

అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం..!