calender_icon.png 20 June, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడు ఆత్మహత్య

19-06-2025 10:39:49 PM

గండీడ్: మండల పరిధిలోని సాలార్ నగర్(Salar Nagar) గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో ఉంటున్న విశాల్ గౌడ్ అనే యువకుడు వారు నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోవడంతో మృతుడి తల్లిదండ్రులు లక్ష్మి, యాదయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేసి మృతికి గల కారణాలు తెలపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. యువకుడు ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో సాలార్ నగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.