7 May, 2026 | 12:18 AM

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

24-06-2024 12:05 AM

ఒక్కరోజే రూ.64.43 లక్షల ఆదాయం

యాదాద్రి భువనగిరి, జూన్ 23 (విజయ క్రాంతి): యాదగిరి లక్ష్మీనృసింహుడి సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దర్శన క్యూ కాంప్లెక్స్‌లు కిక్కిరిసిపోయాయి. సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఒక్కరోజునే స్వామివారికి రూ, 64,43, 032 ఆదాయం సమకూరినట్టు దేవస్థానం కార్యనిర్వహాణాధికారి ఏ భాస్కర్‌రావు తెలిపారు.

స్వామివారి సన్నిధిలో హైకోర్డు జడ్జి 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే శ్రీనివాస్‌రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆశీర్వచనం జరిపారు. ఆలయ ఈవో ప్రసాదాలను అందజేశారు.