రైతు సమస్యల పరిష్కారంలో ముందుండాలి
- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాల, జూన్ 23 (విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముందు వరుసలో ఉండి సేవలందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ పంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మంచిర్యాల మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి డీసీసీబీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా చూడాలని, రైతులకు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉన్నదన్నారు.
అనంతరం మార్కెటింగ్ ఏడీ గజానంద్ నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా నియమితులైన పల్లావుల పద్మ, వైస్ చైర్మన్ బండారి సుధాకర్, డైరెక్టర్లను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం రైతులకు రుణమాఫీ ప్రకటించినందుకు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.






