07-02-2026 12:00:00 AM
జలంధర్‌లో ఘటన
ఛండీఘర్, ఫిబ్రవరి 6: పంజాబ్‌లో ఆప్ నేతను పట్టపగలు మర్డర్ చేశారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆప్ నాయకుడు లక్కీ ఒబెరా య్‌పై పలుమార్లు కాల్పులు జరి పి, బైక్‌పై పారిపోయారు. తీవ్రగాయాలైన ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందాడు. ఈ ఘటన జలంధర్‌లోని గురుద్వారా సాహిబ్ వెలుపల అత్యంత రద్దీగా ఉండే మోడల్ టౌన్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ఈ కాల్పులతో జలందర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
జలంధర్‌లోని గు రుద్వారా సాహిబ్ వద్ద ఒబెరాయ్(38).. తన కారును పార్క్ చేస్తుండగా ఒక్కసారిగా తూ టాలు పేలాయి. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరపడంతో కారులో ఉండగానే ఒబెరా య్‌కు సుమారు 5 బుల్లెట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆయన్ను.. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యు లు పేర్కొన్నారు. ఒబెరాయ్ రోజూ ఉదయం గురుద్వారాను సందర్శిస్తుంటారని తెలుస్తోంది.
ఆయన దినచర్యను గమనించే.. దుండగులు పక్కా ప్లాన్‌తో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత విడుదల చేసి న సీసీటీవీ ఫుటేజ్‌లో ముఖానికి మాస్క్ ధరించిన ఒక వ్యక్తి ఒబెరాయ్ కారు వైపు నడుచుకుంటూ వెళ్లి కాల్పులు జరిపి, బైక్‌పై మరో వ్యక్తితో పారిపోయారు. అయితే లక్కీ ఒబెరాయ్ భార్య సిమర్జోత్ కౌర్.. గతంలో ఆప్ అభ్యర్థిగా ము న్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె పరాజ యం పాలయ్యారు.