ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం
13-07-2026 02:43 AM
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, జూలై 12, (విజయక్రాంతి): విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని...సమాజా భివృద్ధిలో వారు అందించే సేవలు చిరస్మరణీయమని వికారాబాద్ జిల్లా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం యాలాల మండలం ఉపాధ్యాయులు చంద్రయ్య పదవి విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
.ఉపాధ్యాయులుగా చంద్రయ్య తన సుదీర్ఘ సేవా కాలంలో విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల ఉన్నతికి విశేష కృషి చేశారని అన్నారు. అనంతరం చంద్రయ్య దంపతులకు ఎమ్మెల్యే ఘన సన్మానం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ రెడ్డి, ఏఎంసి మాజీ చైర్మన్ బాల్రెడ్డి, కౌన్సిలర్ శ్రీకాంత్, పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






