15-10-2025 08:11:31 PM
పశు వైద్యాధికారి డా.బాలకృష్ణ
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని గ్రామాలలో అక్టోబర్ 16 నుండి నవంబర్14 వరకు ఆవులు, గేదెల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయనున్నట్లు పశు వైద్యాధికారి డా.బాలకృష్ణ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గాలికుంటు వ్యాధి సోకిన పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడం, పునరుత్పత్తి సామర్థం తగ్గిపోవడం తదితర సమస్యలు జరుగుతాయని, అదేవిదంగా చిగుళ్ళు, నాలుక, కాలిగిట్టల మద్యలో పుళ్ళు ఎర్పడి ఆహారం సరిగ్గా తీసుకొక పోవడంతో నీరసం ఏర్పడి చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.