01-08-2025 12:46:55 AM
పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు/రామచంద్రాపురం, జూలై 31 : పటాన్ చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలనీ వాసులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు అమరేందర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీకి చెందిన బిక్షపతి గత కొంతకాలంగా అనారోగ్యంలో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. చికిత్స నిమిత్తం రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు కాగా గురువారం క్యాంపు కార్యాలయం లో బిక్షపతి కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసి అనుమతి పత్రాలను ఎమ్మెల్యేఅందజేశారు.