calender_icon.png 5 August, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ అధికారులను సన్మానించిన ఎస్పీ

01-08-2025 12:49:03 AM

జయశంకర్ భూపాలపల్లి, (మహబూబాబాద్) జులై 31 (విజయ క్రాంతి): సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖలో విధులు నిర్వహించి ఎన్నో కేసులను సమర్ధవంతంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం చేసి పదవి విరమణ పొందుతున్న రేగొండ ఏఎస్‌ఐ మల్యాల ప్రభాకర్, గణపురం ఏఎస్‌ఐ బైరి అప్పయ్యలను గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే జ్ఞాపికలు అందించి,

శాలువాతో ఘనంగా సత్కరించారు. సుదీర్ఘకాలం క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ.నరేష్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రత్నం, శ్రీకాంత్ జిల్లా పోలీసు అధికారుల సంఘం నేత యాది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.