08-12-2025 01:05:31 AM
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్ డిసెంబర్ 7 (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని గుడి మిట్టపల్లి శివాలయంలో, అలాగే పాతవాడలో గల శివాలయంలో , శ్రీ వేణుగో పాలస్వామి దేవాలయం ఆవరణలో గల శ్రీ సాంబశివ దేవాలయం తో పాటు పలు దేవాలయా ల్లో ఆదివారం ఉదయం (భానువారం) మార్గశిర బహుళ తదియ ఆర్ద్ర నక్షత్రం... ( మహాశివుని జన్మ నక్షత్రం ) పురస్కరించుకొని శివునికి రుద్రాభిషేకం కార్యక్ర మాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండువగ నిర్వహించడం జరిగింది...
అనంతరం గుడి మిట్టపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివుడికి అన్న పూజ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు.. పాతవాడలోని శివాలయంలో చైర్మ న్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యం లో అభిషేకంతో పాటు.. శివుడి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు... శివాల యాల్లో పూజారులు పోలస అశోక్ , వల్లకొండ మఠం మహేష్ , పారువెల్ల రమేష్ శర్మలు ప్రత్యేక పూజలు చేశారు... పెద్ద ఎత్తు న భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు..