హోలీ వేడుకల్లో పాల్గొన్న పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్
03-03-2026 07:16 PM
బిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో మంగళవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ కోడూరు సాయా గౌడ్ స్థానిక నాయకులు,యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పురుషులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది.




