15 June, 2026 | 3:08 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

బీజేపీ ఆధ్వర్యంలో అభియాన్ మహోత్సవం

30-03-2026 12:32 AM

హాజరైన మాజీ ఎంపీ బీబీ పాటిల్

బాన్సువాడ,మార్చి 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘం భవనంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో పండిత్ దిన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మాజీ ఎంపీ బీవీ పటేల్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, అంత్యోదయ తత్వం, సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం, గ్రామ స్థాయిలో పార్టీని బలపరచడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి విషయాలపై నాయకులు మార్గనిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ, వార్డు స్థాయిలో చురుకుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.   

జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మనకి బాత్ జిల్లా ఇంచార్జి నరేందర్, పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చీదరసాలు జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, బిజెపి మున్సిపల్ కౌన్సిలర్లు పాశం ఆమని గజ్జల మహేష్ మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ మండలాల అధ్యక్షులు హన్మండ్లు యాదవ్, సాయికిరణ్, శ్రీనివాస్ కిషన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి అనిల్ సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ శివశంకర్ బిజెపి నాయకులు చంద్రశేఖర్ గౌడ్ చీకట్ల రాజు పాశం భాస్కర్ రెడ్డి నాగరాజు కొండని గంగారాం శ్యామల శ్రీకాంత్ తోట శంకర్ సాయిబాబా రాజాసింగ్ మహిళా నాయకురాలు రేణుక లక్ష్మి విజయలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.a