27 March, 2026 | 9:06 PM

ప్రజావాణి రద్దు

29-11-2025 04:31 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు-2025 దృష్ట్యా ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి నిర్వహించు వివరాలను పత్రిక ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుందని, ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.