కవి ‘పసునూరి’పై ఏబీవీపీ దాడి

29-04-2024 01:55:43 AM

సిటీ బ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): హనుమకొండలోని కాకతీ య యూనివర్సిటీలో ఆదివారం సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో ‘లౌకిక విలువలుె సాహిత్యం’ అనే అంశంపై సెమినార్  జరిగింది. నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ నాయకులు వేదికపైకి వచ్చి బేనర్‌ను చించేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత, కవి డాక్టర్ పసునూరి రవీందర్‌తోపాటు కవి సూఫీ, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, రచయితలు జిలుకర శ్రీనివాస్, మెర్సీపై ఏబీవీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. అక్క డే ఉన్న ఓ కవయిత్రిని అసభ్య పదజాలంతో దూషించారు. దాడిని సమూ హ సెక్యూలర్ రైటర్స్ ఫోరం ప్రతినిధు లు ఖండించారు. దాడి  జరుగుతన్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ఏం చేయాలేకపోయారనే విమర్శలు ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపిస్తున్నాయి.