6 August, 2026 | 3:33 PM

నాంపల్లి ఇంటర్ బోర్డు ముందు ఉద్రిక్తత

06-08-2026 02:15 PM

ఏబీవీపీ నాయకుల ఆందోళన

అనుమతి లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

హైదరాబాద్: నాంపల్లి ఇంటర్ బోర్డు( Nampally Inter Board) కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఏబీవీపీ(ABVP) నాయకులు ఆందోళనకు దిగారు. అనుమతి లేకుండా నడుస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏబీవీపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.