6 August, 2026 | 4:24 PM

ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు

06-08-2026 03:21 PM

గుడిసె కుటుంబం వద్దకు వెళ్లిన ఎంపీడీవో

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూర్ గ్రామంలో గుడిసెలో నివాసం ఉంటున్న ఓ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ చేసిన విజ్ఞప్తి మేరకు ఎంపీడీవో ఆనంద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.కుటుంబ సభ్యులు నివసిస్తున్న గుడిసెను సందర్శించి వారి నివాస పరిస్థితులు, కుటుంబ ఆర్థిక స్థితి, అర్హతలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హత ఉంటే సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాందేవ్, గ్రామ కార్యదర్శి రాధిక, ఉప సర్పంచ్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.