బెజ్జంకిలో జయశంకర్ జయంతి వేడుకలు
06-08-2026 03:31 PM
బెజ్జంకి,(విజయక్రాంతి): బెజ్జంకి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ చేసిన సేవలు, ఆయన సిద్ధాంతాలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.






