తెల్లాపూర్‌లో తీవ్ర విషాదం: చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి
తెల్లాపూర్: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెల్లాపూర్ చెరువులో(Tellapur Lake) పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. చిన్నారి తండ్రి ఉదయ్ కిరణ్ ఉదయం శ్రీకర్ వండర్ నెస్ట్ ప్లే స్కూల్లో(Srikar Wonder Nest Play School) షణ్ముక్‌ను దింపాడు. ప్లే స్కూల్లో బోనాల ఉత్సవాలు జరుగుతుండగా బాలుడు బయటకి వెళ్లినట్లు తెలుస్తోంది. చెరువు పక్కనే స్కూల్ ఉండడంతో బాలుడు అందులో పడ్డాడు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారి మృతికి ప్లే స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






