6 August, 2026 | 4:19 PM

ప్రభుత్వ కార్యాలయాల్లో జయశంకర్ సార్ జయంతి

06-08-2026 03:14 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి  ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రామ్మోహన్ రావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కార్యాలయ సిబ్బందితో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ బిమ్లా నాయక్, ఆర్ఐ అచ్యుతరావు,ఏపీఓ రాజన్న, కార్యదర్శి వైకుంఠం కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.