ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
06-08-2026 03:19 PM
గణపురం,(విజయక్రాంతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు మండలంలోని మాధవ పల్లి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ తల్లి పాల ప్రాముఖ్యతను అంగన్వాడీ టీచర్ ఆకుల దివ్య తల్లులకు వివరించారు. అదేవిధంగా ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలను అంగన్వాడీ కేంద్రాలలో పొందాలని దివ్య సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






