20 August, 2026 | 3:01 AM

స్వర్గ వాటికలో ఏసీ వెయిటింగ్ హాల్ ప్రారంభం

20-08-2026 01:29 AM

ప్రీమియర్ ఎనర్జీస్, రోటరీ, లయన్స్ క్లబ్ల సామాజిక సేవ

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): సికింద్రాబాద్ తిరుమలగిరిలోని స్వర్గ వాటికలో నూతనంగా నిర్మించిన ఏసీ వెయిటింగ్ హాల్ను ప్రీమియర్ ఎనర్జీస్, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ప్రారంభించాయి. సీఎస్‌ఆర్ కా ర్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సదుపాయం విషాద సమయంలో స్వర్గ వాటికకు వచ్చే కుటుంబ సభ్యులు, సందర్శకులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించనుంది.

ప్రీమియర్ ఎనర్జీస్ ఛైర్మన్ సురేందర్ పాల్ సింగ్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్టీఎన్. ఉద య్ సుధీర్ పిలానీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయ్ సుధీర్ పిలానీ మాట్లాడుతూ.. కష్ట సమయంలో ఉన్న కుటుంబాలకు గౌరవం, సౌకర్యం అందించడం నిజమైన సామాజిక సేవ అని అన్నారు. ఈ ఏసీ వెయిటింగ్ హాల్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.