సింగూరులో 26 నుంచి ఉర్సు
ఉత్సవాలకు దర్గా ముస్తాబు
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులోని హజ్రత్ మహ్మద్ ఫీర్ బాబాన్ షా వలీ దాదా హజత్ 81వ ఉర్సు ఈ నెల 26, 27, 28 తేదీల్లో వైభవంగా జరగనున్నాయని దర్గా పీఠాధిపతి మహ్మద్ అబీద్ హుస్సేన్ సత్తరూల్ ఖాద్రీ సహేబ్ తెలిపారు. మూడు రోజుల పాటు ఉర్సు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కులమ తాలతకు అతీతంగా వేలాది మంది ప్రజలు పాల్గొంటారని తెలిపారు.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 26వ తేదీన గంధం, చాదర్ ఇంటి నుండి తీసుకొని దర్గా లోకి తీసికెళ్లి కీలక ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు. 27వ తేదిన కబడ్డీ పోటీలు సాయి కుమార్ సమక్షంలో నిర్వహిస్తామన్నారు. అదే రోజు సాయంత్రం నాతే మై ఫీల్ సమ మరియు అన్నదాన కార్య క్రమం ఉంటుదన్నారు. ఈ ఉత్సవాలకు అన్నసాగర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ సుఫీ షా మహ్మద్ ఖలీల్ హుస్సేన్ ఉర్ఫ్ జహీద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ హాజరవుతారని ఆయన తెలిపారు.






