4 July, 2026 | 9:53 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

సహాయ ఉపకరణలకు దరఖాస్తుల స్వీకరణ

10-06-2025 12:00 AM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, జూన్ 9 (విజయక్రాంతి) : అర్హులైన దివ్యాంగులకు సదుపాయ ఉపకరణాలకు దరఖాస్తులు స్వీకరించడం జరుగు తుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ, తెలంగాణ వికలాంగుల సహాయక సమితి ద్వారా జిల్లా లోని ప్రతి దివ్యాంగుడికి సదుపాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నమన్నారు.

జిల్లాకు 45 రెట్రోఫిట్మెంట్ స్కూటీలు, 14 బ్యాటరీ వీల్ చైర్స్, 18 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, 1 బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్, 5 హైబ్రిడ్ వీల్ చైర్లు, 14 ల్యాప్ టాప్స్ (డిగ్రీ విద్యార్థులకు), 7 ల్యాప్ టాప్‌లు (ఉన్నత సాంకేతిక విద్య), 22 టాబ్స్, 2 5జి స్మార్ట్ ఫోన్, 11 చేతి కర్రలు, 3 వీల్ చైర్లు, 1 చెవిటి మిషన్, 6 ట్రై సైకిల్లు, 6 వీల్ చైర్స్, 23 క్రచెస్, 2 చెవిటి మిషన్లు, 23 వాకింగ్ స్టిక్స్, 11 స్మార్ట్ కేన్స్, 11 ఎంసిఆర్ చెప్పల్ మంజూరయ్యాయని తెలిపారు.

అర్హత కలిగి న వికలాంగులు ఆన్‌లైన్ ( https://tgob mms.cgg gov.in)లో ఈ నెల 18లోగా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు హెల్ప్ లైన్ నెంబర్ (155326)లో సంప్రదించాలని కోరారు.