4 July, 2026 | 11:15 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కార్యకర్తలే నా బలం బలగం

09-06-2025 10:44 PM

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): కార్యకర్తలే నా బలం బలగం వారి కోసం నా రక్తం చివరి బొట్టు వరకు శ్రమిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) అన్నారు. సోమవారం పట్టణంలో నూతనంగా నిర్మించిన కళాశాల భవనం, ఆసుపత్రి భవనాలను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... నాకు పదవులు డబ్బు ముఖ్యం కాదని కార్యకర్తల బాగోగులు చూడడమే నాకు ముఖ్యమని ఈ ప్రాంత అభివృద్ధి నా కళ అని కావున ఈ రెండింటి కోసమే నేను కృషి చేస్తానన్నారు.

మంత్రి పదవిని ఆశించామని కానీ సమీకరణాల వలన తనకు దక్కలేదని తనకు ఎటువంటి అసంతృప్తి లేదని అధిష్టానం న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని రెండు వారాలలో ఏదో ఒకటి తేలుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్టానం తనకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ కళాశాల భవనం జూన్ 12 తారీఖున ప్రారంభిస్తామని ప్రభుత్వ ఆసుపత్రి సైతం త్వరలోనే ప్రారంభిస్తానని దీనితో ఈ ప్రాంత ప్రజలకు విద్యా, వైద్య సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ కోట్నాక తిరుపతి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం, డిసిసి ఉపాధ్యక్షుడు చింత అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆరిఫ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.